బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

సీఎం జగన్ పాలనలో బీసీలకు పెద్ద పీట వేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా బీసీలకు 50 శాతం మంత్రి పదవులు, మహిళలకు 33 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటుంటారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అని వైసీపీ నేతలు అరిగిపోయిన రికార్డును మళ్లీ మళ్లీ ప్లే చేస్తుంటారు. అయితే, ఇదంతా డ్రామా అని, బీసీలంటే జగన్ కు చిన్నచూపని విపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. బీసీలను గౌరవించింది చంద్రబాబేనని చెబుతుంటారు.

వారి ఆరోపణలకు తగ్గట్లుగానే తాజాగా బీసీలను జగన్, చంద్రబాబు ట్రీట్ చేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ టూర్ లో ఉన్న చంద్రబాబు, జగన్ లు బీసీలను గౌరవించిన విధానం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ గల్లా నివాసంలో టీడీపీ ఎంపీలు, బీసీ నేతలు, మిగతా కీలక నేతలతో భేటీ అయిన చంద్రబాబు వారందరినీ తనతోపాటు కూర్చోబెట్టుకొని గౌరవంగా మాట్లాడిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఢిల్లీలో జగన్ ను చూసి వంగి వంగి దండాలు పెడుతూ అనామకుల్లాగా నిలుచున్న బీసీ ఎంపీల ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

దీంతో, బీసీల పట్ల జగన్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీలను ఆదదించేది తెలుగుదేశం అని బీసీలకు చెప్పింది చెప్పినట్లు ఆచరించేది తెలుగుదేశం అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. కులాలకతీతంగా, చిన్నా పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా తన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ సముచిత గౌరవం ఇచ్చే నాయకుడు చంద్రబాబు అని టీడీపీ నేతలు, కార్యకర్తలు కొనియాడుతున్నారు.

నియంతలాగా వ్యవహరిస్తూ తన పార్టీకి చెందిన బీసీ నేతలను అవమానించే నేత జగన్ అని మండిపడుతున్నారు. గతంలో బీసీ కోటాలో మంత్రి అయిన చెన్నుబోయిన వేణుగోపాల్…వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లిన ఘటన వైసీపీలో బీసీల గౌరవాన్ని గుర్తు చేస్తుందని అంటున్నారు.
ఎన్నికలకు ముందు మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీలు వైసీపీని నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు. బీసీలు ఎప్పుడూ టీడీపీ పక్షమేనని, ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీకి బీసీలను ఎవరూ దూరం చేయలేరని అంటున్నారు.

ఇక, ఏపీ కోటాలోని రాజ్య‌స‌భ సీట్ల‌ను తెలంగాణకు చెందిన వ్య‌క్తుల‌కు కేటాయించడంపై గతంలోనే టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీలోని 140కి పైగా వున్న బీసీ కులాల‌లో ఏ ఒక్క నేత‌కూ పెద్ద‌ల స‌భ‌కి వెళ్లే అర్హ‌త లేదా? అని గతంలోనే జగన్ ను నిలదీశారు. నిధులు, విధుల‌తోపాటు కూర్చోవ‌డానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేష‌న్లను ఏపీ బీసీల‌కి విదిల్చారని మండిపడ్డారు.

The post బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this