తారక్, షాల భేటీ వెనుక ఆయన?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. మునుగోడులో పర్యటించేందుకు వచ్చిన అమిత్ షా తో లంచ్ మీట్ కు హాజరుకావాలని తారక్ కు ఆహ్వానం అందంది. ఈ క్రమంలోనే బీజేపీలో నెంబర్ టు గా కొనసాగుతున్న అమిత్ షా తో తారక్ భేటీ అయ్యాడు. అయితే, తారక్ నటనను అభినందించేందుకే షా పిలిపించారని ప్రచారం జరిగింది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని, అందుకే తారక్ ను ప్రశంసిచేందుకు షా ఆహ్వానించారని అధికారికంగా పైకి చెబుతున్నారు. అంతేకాదు, వీరిద్దరికీ మీటింగ్ ఏర్పాటు చేసింది రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత, బీజేపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ అని తెలుస్తోంది. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ను బిజేపీ రాజ్యసభకు నామినేట్ చేయడంతో తారక్, షాల మీటింగ్ కు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణలో బిజేపీని బలోపేతం చేసేందుకు, రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు తారక్ ను కోరేందుకు షా ఈ భేటీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలంగా లేదు కాబట్టి ఇక్కడ ప్రచారం చేయడానికి తారక్ కు కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. తారక్ ఉన్న భారీ ఇమేజ్ తమకు మరింత ప్లస్ అవుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారట.

అయితే, గత 13 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తారక్ ప్రస్తుతానికి సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నానని ఇప్పటికే చాలాసార్లు మీడియా వాళ్లకు చెప్పాడు. ఏ పుకార్లు ఎలా ఉన్నప్పటికీ తారక్ తో అమిత్ షా భేటీ ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హార్ట్ టాపిక్ గా మారింది.

The post తారక్, షాల భేటీ వెనుక ఆయన? first appeared on namasteandhra.

Thanks! You've already liked this