రౌడీ ఫ్యాన్స్ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసిన షాలినీ పాండే

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లకు పైనే చెక్కి.. చెక్కి తీర్చిదిద్దిన ‘లైగర్’ మూవీ ఈ రోజు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతోపాటు అతడ్ని ముద్దుగా రౌడీ అని పిలిచే ఆయన ఫ్యాన్స్ అంతా కూడా మిస్ అయిన పాయింట్ ను నటి షాలినీ పాండే గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

ఇప్పుడంతా లైగర్ హడావుడిలో మునిగిపోయిన వేళ.. పాత విషయాన్ని కొత్తగా గుర్తు చేసి రౌడీ ఫ్యాన్స్ లో జోష్ నింపింది షాలినీ పాండే.

తాజాగా ఆమె పెట్టిన పోస్టు సారాంశం ఏమంటే.. సుమారు ఐదేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్టు 25న) అర్జున్ రెడ్డి మూవీ విడుదలైందని.. తనను వెండితెరకు పరిచయం చేసిన వైనం ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించినట్లుగా పేర్కొంది. ఆ మూవీలో తాను పోషించిన ప్రీతి పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి తాను ఎప్పటికి కృతజ్ఞురాలినేనని పేర్కొంది.

తన తొలి చిత్రాన్ని ఎలా చేస్తానా?అన్న టెన్షన్ లో ఉన్న తనలో ఉత్సాహాన్ని నింపి.. షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేసిన తన సహనటుడు విజయ్ దేవరకొండకు ఆమె థ్యాంక్స్ చెప్పింది ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రౌడీ అభిమానుల్ని సంతోషంలో నింపుతున్నాయి.

‘లైగర్.. నువ్వు చేసిన ప్రతి పనికి థ్యాంక్యూ. లవ్ యూ. అలానే నీ కొత్త మూవీ మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

ఐదేళ్ల క్రితం ఇదే రోజున విజయ్ దేవరకొండ ఇమేజ్ ను అమాంతం పెంచేసి.. స్టార్ స్టేటస్ కు తీసుకొచ్చిన రోజునే అతని కెరీర్ లోనే అత్యంత భారీ మూవీ విడుదల కావటానికి మించిన హ్యాపీ న్యూస్ విజయ్ అభిమానులకు ఇంకేం ఉంటుంది చెప్పండి.

The post రౌడీ ఫ్యాన్స్ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసిన షాలినీ పాండే first appeared on namasteandhra.

Thanks! You've already liked this