గణేష్ నిమజ్జనం : అల్లు అర్హతో గెంతులేసిన అల్లు అర్జున్

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల్ని ఎవరికి వారు వారికి తోచినట్లుగా నిమజ్జనం చేస్తుండటం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం చూస్తే..ఈ శుక్రవారం మహా నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. అయితే.. దానికి ముందే.. ఎవరికి వారు మూడు రోజులకు.. ఐదు రోజులకు నిమజ్జనాన్ని చేస్తున్నారు. తాజాగా అలా జరిగిన నిమజ్జనానికి వచ్చిన క్రేజీ హీరో కారణంగా.. సదరు నిమజ్జన కార్యక్రమంలో జోష్ పీక్స్ కు చేరిన పరిస్థితి. అదెలానంటే..

జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ భవనంలో గణేషుడ్ని ఏర్పాటు చేశారు. దాని నిమజ్జన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బన్నీ తన కుమార్తె చిన్నారి అర్హతో కలిసి హాజరయ్యారు. అర్హాను స్వయంగా ఎత్తుకొచ్చిన బన్నీ.. అక్కడి సందడి వాతావరణాన్ని ఆమెకు పరిచయం చేశారు. చుట్టూ ఉన్న వారంతా గణపతి బప్పా మోరియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటే.. వారికి బన్నీ గొంతు కలపగా.. అర్హ కూడా గొంతు కలపటం చూపురులను కట్టి పడేసింది.

గణపతికి వీడ్కోలు పలుకుతూ బన్నీ కొబ్బరికాయ కొట్టటమే కాదు.. ఊరేగింపు రథం మీద తన కుమార్తెను కూడా కాసేపు నిలుచోబెట్టారు. ఇక.. కుమార్తెను ఎత్తుకొని మురిసిపోతూ.. చేసిన డ్యాన్స్ తో అక్కడి వారిలో జోష్ పీక్స్ కు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిమజ్జనం ఎంత సందడిగా ఉంటుందన్న విషయాన్న చిన్నారికి తెలియజేసేందుకు వీలుగా బన్నీ ఆమెను తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది.

The post గణేష్ నిమజ్జనం : అల్లు అర్హతో గెంతులేసిన అల్లు అర్జున్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this