దాన్ని బ్రోతల్ హౌస్ లా మార్చారు..అయ్యన్న ఫైర్

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తొలిరోజు సమావేశాలలోనే మూడు రాజధానులపై, మూడు రాజధానులకు సంబంధించిన కొత్త బిల్లుపై సీఎం జగన్ ప్రసంగిస్తారని లీకులు రావడం హాట్ టాపిక్ గా మారింది.

ఓవైపు అమరావతే ఏపీ రాజధాని అని, అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు, రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ నెల 27న ఏపీ సీఎస్ తో కేంద్రంలోని అధికారులు చర్చలు జరపబోతున్నారు. దీన్ని బట్టి కేంద్రం కూడా అమరావతికే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అయినా సరే జగన్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ పాత పాటే పాడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. పిచ్చి తుగ్లక్ తరహాలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుందని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. గతంలో అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పిన జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానులు అంటూ కొత్త పాట పాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అపరిపక్వ నిర్ణయాలతో ఏపీని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్రపై వైసీపీ నాయకులకు హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని, ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు వైసీపీ చేసింది ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. తుఫాను సమయంలో చంద్రబాబు స్వయంగా విశాఖలో పర్యటించి బాధితులకు అండగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఆంధ్ర యూనివర్సిటీని బ్రోతల్ హౌస్ లా మార్చారని, వీసీ ఆఫీసును వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర ఇన్ చార్జినంటూ పబ్బం గడుపుకున్న విజయసాయిరెడ్డి పదివేల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఆ అంశంపై విజయసాయి రెడ్డి చర్చకు సిద్ధమా అని అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. ఇటువంటి దోపిడీదారులతో నీతులు చెప్పించుకునే ఖర్మ తమకు పట్టలేదని ఎద్దేవా చేశారు.

The post దాన్ని బ్రోతల్ హౌస్ లా మార్చారు..అయ్యన్న ఫైర్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this