ఇండియాలో కొత్తగా 5383 కరోనా కేసులు.. 20 మంది మృతి

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5383 కరోనా వైరస్ కేసులు, 20మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు, మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,58,425కు, మొత్తం మరణాల సంఖ్య 5,28,449కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,39,84,695కి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 45,281 యాక్టివ్‌ కోవిడ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉండగా, రికవరీ రేటు 98.71శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Thanks! You've already liked this