గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆవిష్కరించనున్నారు. 16 ఫీట్ల ఈ భారీవిగ్రహంఏర్పాట్లను శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆదివారం ఉదయం 10.30కు సీఎంకేసీఆర్‌ ఎంజిరోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్క్‌లైన్‌,ప్యాట్నీసిగ్నల్‌, క్లాక్‌ టవర్‌,సంగీత్‌,చిలకల గూడా చౌరస్తా మీదుగా గాంధీ ఆసుపత్రికి చేరుకుంటారు. అనంతరం గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన మహాత్మ గాంధీ విగ్రహాన్ని సిఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు.ఈసందర్భంగా గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సిఎం.కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

Thanks! You've already liked this