జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 6 వరకు బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 6 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు విరామంతో 66 రోజుల పాటు 27 సమావేశాలు ఉంటాయి. సమావేశం ప్రకారం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు బడ్జెట్‌ సెషన్‌, 2023 జనవరి 31 నుండి ప్రారంభమై ఏప్రిల్‌ 6 వరకు 66 రోజుల పాటు సాధారణ విరామంతో 27 సమావేశాలతో కొనసాగుతుంది.

రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్‌, ఇతర అంశాలపై ధన్యవాద తీర్మానంపై చర్చల కోసం అమ్సత్‌ కాల్‌ ఎదురు చూస్తున్నాను అని జోషి ట్వీట్‌ చేశారు. ”2023 బడ్జెట్‌ సెషన్‌ సమయంలో, డిపార్ట్‌మెంట్‌ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలు గ్రాంట్స్‌ కోసం డిమాండ్‌లను పరిశీలించడానికి, వారి మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన నివేదికలను రూపొందించడానికి వీలుగా ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు విరామం ఉంటుందని ఆయన చెప్పారు.

Thanks! You've already liked this