ఇమ్రాన్ ఇంటి వద్ద పోలీస్ ఆపరేషన్
. 10 వేల మందికిపైగా ఖాకీలు
. పీటీఐ కార్యకర్తల అరెస్టు`క్యాంపుల తొలగింపు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం జమన్ పార్క్ వద్ద పోలీసు ఆపరేషన్ జరిగింది. ఇందులో 10వేల మందికిపైగా పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇంటి ఆవలి బారికేడ్లను తొలగిస్తూ ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన క్యాంపులను తొలగించారు. 30 మంది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో లేరు. అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ వెళ్లారు. పోలీసు చర్య క్రమంలో 10 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇమ్రాన్ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడున్న కార్యకర్తలపై లాఠీలు రaుళిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. జమన్ పార్క్ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసు ఆపరేషన్ జరిగినట్లు మంత్రి అమీర్ మీర్ వెల్లడిరచారు. ‘జమన్ పార్క్ ‘నోగో’ ప్రాంతంగా మారింది. నిషేధిత సంఘాల సభ్యులు కూడా అక్కడ నక్కివున్నట్లు సమాచారం వచ్చింది. 10వేల మంది పంజాబ్ పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కొంతమంది పీటీఐ కార్యకర్తలను కస్టడీలోకి తీసుకున్నారు’ అని మంత్రి అన్నారు. ముగ్గురు పోలీసులకు, ఆరుగురు పీటీఐ కార్యకర్తలకు గాయాలైనట్లు ఆయన తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ఇంటిని సోదా చేసేందుకు పోలీసుల వద్ద సర్చ్ వారెంట్లు ఉన్నాయని, వాటిని ఉగ్రవాద నిరోధక కోర్టు జారీచేసిందని చెప్పారు. నన్ను జైలుకు పంపాలనే...: ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పూనుకుంటోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. బహిష్కృత నేత నవాజ్ షరీఫ్ కోసం ఇదంతా చేస్తున్నదని, తనను జైలుకు పంపిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని ఓ వీడియో సందేశంలో వెల్లడిరచారు. ఈ ప్రభుత్వం నిజరూపం బయటపడిరదని అన్నారు. జమన్ పార్క్‌లోని తన ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిరచారు. ఇది జరిగినప్పుడు తన భార్య బుష్రా బీబీ ఇంట్లో ఒంటిరిగా ఉన్నట్లు 70ఏళ్ల నేత తెలిపారు. ‘ఏ చట్టం ప్రకారం వారు ఇదంతా చేశారు. ఇది లండన్ ప్రణాళిక.. నవాజ్ షరీఫ్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చే కుట్ర’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుంటే తాజా పరిణామాల ప్రత్యక్ష ప్రసారాన్ని పాకిస్తాన్ మీడియా నిలిపివేసినట్లు సమాచారం. తొమ్మిది కేసుల్లో ఇమ్రాన్‌కు బెయిల్
కోర్టుకు హాజరైన పీటీఐ చీఫ్
పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేసింది. సెషన్స్ కోర్టులో హాజరయ్యేందుకు భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. మరోవైపు లాహోర్ హైకోర్టు (ఎల్‌హెచ్‌సీ) శుక్రవారం ఆయనకు ఉగ్ర కేసుల్లో ఉపశమనం కల్పిస్తూ ప్రొటెక్టివ్ బెయిల్ ఇచ్చింది. లాహోర్‌లో నమోదైన ఐదు కేసుల్లో ఈనెల 27వ తేదీ వరకు ఇస్లామాబాద్‌లో నమోదైన మూడు కేసుల్లో 24వ తేదీ వరకు బెయిల్ మంజూరైంది. ఇమ్రాన్ లాహోర్ హైకోర్టుకు వెళ్లి తనపై ఇస్లాబామాద్, లాహోర్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల క్రమంలో రక్షణ కల్పిస్తూ బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మీరు చట్టబద్ధ పద్ధతిని అనుసరించడం సబబుగా ఉంటుంది’ అని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని, మరొక కేసులో హాజరు కావాల్సి ఉండగా ఆత్మాహుతి దాడి జరిగిందని ఇమ్రాన్ చెప్పగా ధర్మాసనం పట్టించుకోలేదు. ‘ఈ కేసు సమస్య కాదు. మీ వద్దనే నిర్వహణ లోపాలు ఉన్నాయి’ అని పేర్కొంది. పాకిస్తాన్ రేంజర్ల తీరును ఇమ్రాన్ తప్పుపట్టారు. కశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు వచ్చినట్లుగా వ్యవహరించారన్నారు. ‘నేనేదో కరగడుగట్టిన ఉగ్రవాది అన్నట్లుగా నా ఇంటిపైదాడి జరిగింది’ అని చెప్పారు. అన్ని సమయాలు తన పార్టీ నేతలు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. ‘మన పార్టీ నేతలు షాబాజ్ గిల్, అజం స్వాతిలానే తననూ వేధిస్తారు… మిమ్మల్ని అరెస్టు చేయనివ్వం’ అని వారు తనతో చెప్పినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
The post ఇమ్రాన్ ఇంటి వద్ద పోలీస్ ఆపరేషన్ appeared first on విశాలాంధ్ర.