మూడోదీ టీడీపీనే
పశ్చిమలో రామగోపాల్ రెడ్డి విజయం
విశాలాంధ్ర – అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అనంతపురము నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించగా శనివారం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కలేదు. ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. ఈ కౌంటింగ్‌లో భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వెన్నపూస రవీంద్రరెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని ప్రకటించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
The post మూడోదీ టీడీపీనే appeared first on విశాలాంధ్ర.