ఏపీలో ఎల్లుండి నుంచే టెన్త్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూౌ టెన్త్‌ పరీక్షల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. ఎల్లుండి నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని.. ఆరు పేపర్లే ఉంటాయని తెలిపారు.. ఇక, ఉదయం 9.30 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.. కానీ, ఎవరికైనా వ్యక్తిగతంగా సరైన కారణం చెబితే పరీక్షా కేంద్రంలోకి అనుమతించే విషయాన్ని ఆలోచించనున్నట్టు వెల్లడించారు.

The post ఏపీలో ఎల్లుండి నుంచే టెన్త్ పరీక్షలు appeared first on విశాలాంధ్ర.

Thanks! You've already liked this