ఓవర్సీస్ రికార్డులు తిరగరాయబోతున్న ప్రభాస్….

ఇండియా లో నే హైయెస్ట్ పైడ్ ఆర్టిస్ట్ ఎవరు అని చెప్పటం తోనే అందరికి గుర్తొచ్చే పేరు ప్రభాస్, అలాగే ఇప్పుడు ఓవర్సీస్ బిజినెస్ లో కూడా నెంబర్ వన్ గ ప్రభాస్ నిలిచారు.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే హైయెస్ట్ పైడ్ ఆర్టిస్ట్ అని అందరికి తెలిసిందే, ఒక సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు అని సమాచారం. అలాగే ఇండియా లోనే హైయెస్ట్ పైడ్ బడ్జెట్ మూవీస్ కూడా ప్రభాస్ నుంచే వస్తున్నాయ్. త్వరలో ఓంరావత్ తీస్తున్న ఆదిపురుష్ రిలీజ్ కి అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 14th న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయటానికి అని ఏర్పాట్లు చేసారు.

అలాగే KGF డైరెక్టర్ ప్రశాంత్ నెల్ తో సాలార్ మూవీ 400 కోట్లతో నియమిస్తున్నరు, ఈ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈమూవీ ఏకంగా 1000 నుంచి 1200 కోట్ల లో వాసులు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా 80 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇంకా నాగ్ అశ్విన్ తో చేస్తున్న Project K మీద ఐతే ఏకంగా 100 కోట్ల వరకు ఓవర్సీస్ బిజినెస్ అవుతుంది అని అంచనా. ఈ సినిమా ని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలి అని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ సినిమా మీద డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు చాల అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ళ అంచనా ప్రకారం ఏకంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయి అని అనుకుంటున్నారు.

Project K అండ్ సాలార్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి టాక్ వస్తుందా అని టాలీవుడ్ లో అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ మూవీస్ ప్రభాస్ కెరీర్ ని ఎలా తీసుకెళ్తాయో చూడాల్సి ఉంది.

The post ఓవర్సీస్ రికార్డులు తిరగరాయబోతున్న ప్రభాస్…. appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this