ఒంటికి నిప్పంటించుకుని RMP ఆత్మ‌హ‌త్య‌..

మహబూబాబాద్ : తొర్రూరు దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక ఆర్ఎంపీ డాక్ట‌ర్ సూసైడ్ క‌ల‌క‌లం రేపింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో ఆర్ఎంపీ డాక్టర్ జమాలుద్దీన్ (47) అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్ప‌డి ఉండ‌వచ్చున‌ని ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులా? మ‌రే ఇత‌ర కార‌ణాల‌చేత ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Thanks! You've already liked this