జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. జపాన్ రాజధాని టోక్యోకు ఆగ్నేయంగా 107 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుందని ఆ దేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడిరచింది. భూకంపం ధాటికి భూ ఉపరితలం నుంచి 65 కిలోమీటర్ల లోతువరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. సరిగ్గా మధ్యాహ్నం 3.33 గంటలకు ఈ భూకంపం సంభవించిందని తెలిపింది. కాగా ఈ భూకంపంవల్ల ఏదైనా ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టంగానీ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
The post జపాన్‌లో భారీ భూకంపం appeared first on విశాలాంధ్ర.