Andraprabha Effect : నర్సంపేట బేకరీలో.. అధికారుల తనిఖీ

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆహార తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.కనీస ప్రమాణాలు పాటించని బేకరీ, బిర్యానీ సెంటర్లు అని శీర్షికతో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించగా ఆహార తనిఖీ అధికారులు స్పందించి న్యూ బేకర్స్ డన్ బేకరీలో అహర తనిఖీ అధికారి కృష్ణ మూర్తి తనిఖీ నిర్వహించి, యజమాని పై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నియమాలు పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి సంజాయిషీ పత్రం రాయించి చర్యలకు అంగీకారం తీసుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి వ్యాపార సముదాయం లైసెన్స్ కలిగి ఉండాలని, వరుస తనిఖీలు చేస్తామని తెలిపారు.

Source

Thanks! You've already liked this