పాపం బ‌య‌టప‌డుతుంద‌ని..`ఫ‌లితం` ఆపేసిన బొత్స

అడుసు తొక్క‌నేల‌.. అన్న సామెత ఏపీ ప్ర‌భుత్వానికి అచ్చ‌గుద్దిన‌ట్టు స‌రిపోతుంద‌ని అంటున్నారు విద్యా వేత్త‌లు. ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌కు విద్యార్థులు బ‌ల‌వుతున్నారు. దీంతో ఆ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెడితే.. త‌మ పాపం ఎక్క‌డ బ‌య‌ట‌పడుతుందోన‌న్న ఉద్దేశంతో అస‌లు ఫ‌లితాల‌ను కూడా వెల్ల‌డించ‌కుండా.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామంటూ ప్రభుత్వం మండలానికో హైస్కూల్‌ ప్లస్‌ పేరుతో ఇంటర్మీడియట్‌ ప్రారంభించింది. వీటిలో లెక్చరర్లు లేక ఫలితాలు ఘోరంగా వచ్చాయి. ఈ ఫలితాల్ని బయట పెడితే పరువు పోతుందనే భయంతో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అస‌లు ఈ ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌డ‌మే మానేశారు. యాజమాన్యాల వారీగా వెల్లడించాల్సిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు.

ప్రభుత్వం హడావుడిగా హైస్కూల్‌ ప్లస్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్‌లో 12% మందే ఉత్తీర్ణులయ్యారు. 63 హైస్కూల్‌ ప్లస్‌ల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఇవేకాక 33 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. బాలికలకు చదువు చెప్పించేందుకు లెక్చరర్లను నియమించని కార‌ణంగానే ఈ ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని విద్యానిపుణులు చెబుతున్నారు. మొదటి ఏడాది చదివిన విద్యార్థులు ఇప్పుడు రెండో సంవత్సరంలోకి వచ్చారు. వీరికి ప్రాక్టికల్స్‌ ఉంటా యి. కానీ, ఎక్కడా హైస్కూల్‌ ప్లస్‌లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదు. ఆదర్శ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని ల్యాబ్‌లను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

సమీపంలో అవి లేకపోతే బాలికలు ప్రాక్టికల్స్‌కు ఎలా వెళ్తారు? గతేడాది జులై చివరి వరకు హైస్కూల్‌ ప్లస్‌ వారికి ఇంటర్‌ తరగతులే ప్రారంభించలేదు. పైగా హైస్కూల్‌ ప్లస్‌ల్లో ఈ ఏడాది ప్రవేశాలను పెంచేందుకు కొన్నిచోట్ల ప్రభుత్వ బడుల్లో పదోతరగతి చదివిన వారికి టీసీలు ఇవ్వడం లేదు. పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లు లేకుండానే 294 ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్‌ ప్లస్‌ పేరిట ఇంటర్మీడియట్‌ను ప్రారంభించారు. ఉన్నత పాఠశాలలో బోధించే టీచర్లకు శిక్షణ ఇవ్వకుండానే బోధన బాధ్యతలు అప్పగించారు.

ఉచిత పాఠ్య పుస్తకాలూ ఇవ్వలేదు. జులై చివర్లో తరగతులు ప్రారంభించారు. 3,054 మంది ఇంటర్‌ పరీక్షలు రాస్తే 366 మంది అంటే 12% మందే ఉత్తీర్ణులయ్యారు. 2,688 మంది ఫెయిల్‌ అయ్యారు. అందుకే.. ఈ ఫ‌లితాలు వెల్ల‌డించ‌కుండా.. మంత్రి బొత్స చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌క‌లు.

The post పాపం బ‌య‌టప‌డుతుంద‌ని..`ఫ‌లితం` ఆపేసిన బొత్స first appeared on namasteandhra.

Thanks! You've already liked this