ప్రజలు ఆరోగ్యంకోసం ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్న ప్ర‌భుత్వం

వరంగల్, వర్ధన్నపేట : మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ ఆరెల్లి స్రవంతి అంజన్ రావు ఆధ్వర్యంలో ఎంపీపీ అప్పారావు, జడ్పిటిసి మార్గం బిక్షపతి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంటి సమస్యల‌తో ప్రజలు బాధపడుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ఈ కార్యచరణకు శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కొనియాడారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకున్న లబ్ధిదారులకు కళ్ళజోడు పంపిణీ చేశారు. వారి వెంట ఎంపిటిసి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Source

Thanks! You've already liked this