పేద ప్రజల్లో వెలుగు నింపడమే కెసిఆర్ ధ్యేయం…… ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండే

బాన్సువాడ , మే 26 ప్రభ న్యూస్ – నిరుపేద వర్గాల ప్రజల్లో వెలుగు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండే అన్నారు. శుక్రవారం నాడు జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండల కేంద్రంలో గొర్రెల పెంపకం దారుల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కుటుంబంలో పెద్ద ఎలా ఉంటాడో అలా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు కుటుంబ పెద్దగా ఆర్థికంగా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుండడంతో అన్ని వర్గాల ప్రజల్లో దేవుడయ్యాడని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నేటికీ కుటుంబంలో పెద్దమనిషి ఎలా పోషిస్తాడొ అవసరాన్ని బట్టి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆదుకుంటాడో అలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి అవగాహన కల్పిస్తూ పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

గతంలో గొర్రెల పెంపకం దారులకు ఇచ్చిన గొర్రెలను ఒకటికి అదనంగా లబ్ధి పొందేలా కష్టపడ్డప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మంజూరు చేస్తున్నందుకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సంక్షేమ ఫలాలను ఇంటింతై వటుడింతై లాభాల బాటలో పయనించాలని ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో అన్ని వర్గాల ప్రజలకి పార్టీలకతీతంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నిరుపేద వర్గాల ప్రజలకి ఏ సీజన్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే ఆర్థికంగా బాగుపడతారని నిత్యం ప్రజల గురించే ముఖ్యమంత్రి ఆలోచిస్తారని ఆయన అన్నారు. ఒక రైతుబిడ్డగా గ్రామీణ ప్రాంతాలలో పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ప్రతినిత్యం సంక్షేమ ఫలాలు అందిస్తూ నిరుపేద వర్గాల ప్రజలకి ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం సర్పంచ్ విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, పిట్లం జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కవిత విజయ్, మాజీ ఎంపీపీ నరస గౌడ్ ,పెంపకం దారులు రైతులు తదితరులు పాల్గొన్నారు

Source

Thanks! You've already liked this