బ్రాహ్మణులను కించపరుస్తున్నరంటు ఆవేదన..!

హిందూ సాంప్రదాయల ప్రకారం మనం చేసే ప్రతి పని మంచి పనులలో, శుభకార్యాలలో బ్రాహ్మణులది చాలా ఉన్నతమైన ప్రాత. కానీ సినిమాలో మాత్రం అలా లేదు అని బ్రాహ్మణులు ఆవేదన చెందుతున్నారు. సినిమాలు మొదలవాలన్న తమతో పూజ చేపించుకొని, అన్నీ శుభం జరగాలని ఆశీర్వదాలు తీసుకుంటారు, కాని సినిమాలో తమ పాత్రలను ఏందుకు ఇంత కించ పరిచెట్టు తీస్తారు అని బ్రాహ్మణుల సంగం ఆవేదన వేక్తం చేశారు.

ఈ మధ్యకాలంలో బ్రాహ్మణుపైన , హిందూ దేవాలయలపైన హేళనగా కొన్ని సన్నివేశాలు వస్తున్నాయని “బాగ్యనగర అర్చక పురోహిత సంగం” ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోని భాగంగా ఇటివల విడుదలైన శరభ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ, మరియు బ్రాహ్మణులను చంపుతున్నట్టు తీసిన సన్నివేశాలు తమను చాలా బాధకలిగించాయని అన్నారు. ఈ సినిమాలో మరీ బ్రాహ్మణులకు దెయ్యం పట్టినట్టు, బ్రాహ్మణులని చంపుతున్నట్టు తీసిన తీరు తమను కించ పరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు.

బాగ్యనగర అర్చక పురోహిత సంగం కమిటి సభ్యులు అందరు కలిసి తెలంగాణా ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని కలిసి ఈవిదమైనా సినిమాలని ప్రోత్సాహించవద్దు అని సంగం తరుపు వినతి పత్రం సమర్పించారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు స్పందిస్తూ “ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇలా కించ పరిచే వాటికి మేము ఎప్పుడు వ్యతిరేకమే. మళ్ళి ఇలాంటి సన్నివేశాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు”.

బాగ్యనగర అర్చక పురోహిత సంగం తరుపున ప్రెసిడెంట్ గట్టు శ్రీనివాసాచార్యులు గారు, వైస్ ప్రెసిడెంట్ కొట్టారు అనంతనాగ శర్మ గారు , జనరల్ సెక్రటరి మల్లాది చంద్రమౌళి గారు, ఆరుట్ల కరుణకరాచార్యులు గారు పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్న జీయర్ స్వామి గారు ఈ చిత్రంని చూసినప్పుడు ఈవిధమైన సన్నివేశాలు లేకపోవడం, తరువాత కలపడం జరిగిందంట….!

Thanks! You've already liked this
No comments