గండేపల్లి : ఆదర్శంగా గండేపల్లి మండలపాత్రికేయులు

గండేపల్లి : మండల పాత్రికేయులు తమ సేవా కార్యక్రమాల ద్వారా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎంపీడీవో జాన్ లింకన్ అన్నారు. లాక్ డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్న వలస కూలీల కు బాసటగా నిలిచి వారి ఆకలి తీర్చేందుకు ఆహార పొట్లాలను శుక్రవారం గండేపల్లి జాతీయ రహదారి వద్ద పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసిల్దార్ చిన్న రావు, ఎంపీడీవో జాన్ లింకన్, ఎస్సై తిరుమలరావు, పి హెచ్ సి వైద్యాధికారిణి సౌమ్య తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ లో పలువురు వలస కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారని, వారంతా తమ స్వగ్రామాలకు నడిచి, వాహనాలలో వెళ్తున్నారని తెలిపారు. సరైన ఆహార సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చాయి అన్నారు. గండేపల్లి మండల విలేకరులు సంఘం వారు బిర్యాని, పెరుగు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, అరటి పండ్లు వలస కూలీల కి పంచడం కావలసిన అభినందించ వలసిన  విషయమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. విలేకర్ల సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రతినిత్యం లాక్ డౌన్ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న వలస కూలీలు కు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఆహారం అందించి ఆదుకుంటున్నారు అని తెలిపారు. వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూసి చలించిపోయా ము అన్నారు. తాము కూడా వలస కూలీలు కు భోజనం అందించాలని అనుకుని ఈ సేవా కార్యక్రమం చేశామన్నారు . ఈ కార్యక్రమంలో మండలవిలేకరులు సంఘ అధ్యక్షుడు పెను గాడ సూరిబాబు, చింతల రాంబాబు, ఉప్పలపాటి సూర్యప్రకాశచౌదరి,  వెలిది బాబులు, వల్లభ శెట్టి శ్రీను, శ్రీమంతుల రాజు, తణుకు రామచంద్ర రావు, చింతపల్లి శివ తమ్మన బోయిన సతీష్ కొత్త గళ్ళ శ్రీను, పండు,  వట్టూరి నాని, తదితరులు పాల్గొన్నారు

Thanks! You've already liked this