ఖిలాడీనే ఖాయం చేశారు

ర‌వితేజ – ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈరోజే క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి `ఖిలాడీ` అనే టైటిల్ పెట్ట‌బోతున్నార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే ఖాయం చేశారు. ఈరోజే ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టైటిల్ విడుద‌ల చేశారు. `ఖిలాడీ` అనే పేరు ఖ‌రారు చేసేశారు. ర‌వితేజ న‌టిస్తున్న 67వ చిత్ర‌మిది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఓ త‌మిళ చిత్రానికి ఇది రీమేక్ అని ప్ర‌చారం జ‌రిగింది. నిజానికి రీమేక్ చేయాల‌న్న ఉద్దేశ్యంతో ఆ హ‌క్కుల్ని కూడా తీసుకున్నారు. కానీ.. ఆ త‌ర‌వాత‌.. ఆ క‌థ‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టి, కొత్త క‌థ రాసుకున్నార్ట‌. పేరుకి త‌గ్గ‌ట్టే..రవితేజ క్యారెక్ట‌రైజేష‌న్ మాసీగా, ఇంటిలిజెంట్ గా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నారు. ప్ర‌స్తుతం `క్రాక్`లో న‌టిస్తున్నాడు ర‌వితేజ‌. ఆ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. డిసెంబ‌రు నుంచి మారుతి సినిఆమ‌నీ మొద‌లెట్టేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

The post ఖిలాడీనే ఖాయం చేశారు appeared first on తెలుగు360.

Thanks! You've already liked this