ఎందుకిలా అయిపోయారు?

వామపక్షాలు,

తెలంగాణలో ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో హామీలు గుప్పిస్తూ ప్రజల ముందుకు వెళుతున్నాయి. దుబ్బాక ఎన్నికలకు ఇంకా పది రోజుల సమయం ఉంది. అయితే ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీల జాడ కన్పించడం లేదు. వాళ్లు కనీసం పోటీకి కూడా దిగకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో కొంత….

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం వామపక్షాలు కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నాయనే చెప్పాలి. ఖమ్మం, మెదక్, కరీనంగర్ తదితర ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే గడచిని రెండు ఎన్నికల్లో వామపక్షాలు ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో పెద్దగా ప్రజల్లో కూడా నలుగుతుంది లేదు. ప్రజా ఉద్యమాలను కూడా వామపక్షపార్టీలు పెద్దగా చేపట్టడం లేదు.

పోటీకి దూరం…..

అయితే దుబ్బాక ఉప ఎన్నికకు వామపక్ష పార్టీలు పోటీ చేస్తాయని భావించారు. ఎందుకంటే దుబ్బాక అంటేనే ఉద్యమాల గడ్డ అని పేరు. ఇక్కడ తొలి నుంచి వామపక్ష పార్టీలకు క్యాడర్ ఉంది. ప్రస్తుతం వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు అధికార, విపక్ష పార్టీలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. అందుకే ఈ ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలసి పోటీ చేస్తాయనుకున్నారు. కానీ అనూహ్యంగా వామపక్షాలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.

ఎవరో ఒకరికి…..

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీలు పోటీ చేశాయి. గతంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ సీపీఐ అధికార పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించి తర్వాత వెనక్కు తీసుకున్నారు. అయితే ఇందులో సీపీఐ అధికార పార్టీ టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశాలున్నాయంటున్నారు. సీపీఎం కూడా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. తమకు బలం ఉన్న చోట వామపక్షాలు కనీసం పోటీకి నిలపకపోవడం చర్చనీయాంశమైంది. ఎటూ ఓటమి తప్పదని తెలిసి ఊరుకున్నారా? లేక ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతిచ్చేందుకే పోటీకి దిగలేదా? అన్న అంశంపై పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటుంది.

The post ఎందుకిలా అయిపోయారు? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this