మెగాస్టార్ సరసన మహానటి

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్, మెగాస్టార్ చిరంజీవి చేసే ప్రతి ఒక్క చిత్రం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సై రా నరసింహ రెడ్డి లాంటి హిస్టారికల్ మూవీ లో హీరో గా నటించి ఈ తరం నటులకు కూడా ఇన్స్పిరేషన్ గా మారారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తమిళం లో సూపర్ హిట్ అయిన వేదాలం చిత్రాన్ని తెలుగు లో తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రానికి దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాలో చెల్లి పాత్ర కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది. ముందుగా సాయి పల్లవి, కీర్తి సురేష్ అంటూ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మహానటి సినిమా తో ఎంతో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో నటించనున్న వార్త వచ్చినప్పటి నుండి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

The post మెగాస్టార్ సరసన మహానటి appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this