మళ్లీ ఒక్కటవుతారా?

కుమారస్వామి

బీజేపీని నిలువరించాలంటే మరోసారి రెండు పార్టీలు ఏకం కాక తప్పదు. కర్ణాటకలో క్రమంగా సీన్ మారుతుంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు అనేక చోట్ల విజయం సాధించాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండుకలసి బరిలోకి దిగితే విజయం ఖాయమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి మళ్లీ అడ్వాంటేజీగా మారనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుమారస్వామి పార్టీ పుంజుకోవడం విశేషం.

చాలా సమయం ఉన్నా…?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడింది. కుమారస్వామి పార్టీ తిరిగి పుంజుకుంది. గుడిబండె మున్సిపాలిటీలో జనతాదళ్ రెండు వార్డుల్లో గెలిచారు. బేలూరు మున్సిపాలిటీలో ఐదు వార్డులను గెలుచుకుంది. బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న విజయపురి మున్సిపాలిటీని కుమారస్వామి కైవసం చేసుకోగలిగారు. 23 వార్డుల్లో పదమూడు వార్డులను గెలుచుకున్నారు.

ఇద్దరూ కలిస్తేనే?

ీఈ ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేస్తే బీజేపీని నిలువరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే కుమారస్వామి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా కూడా నియమించుకున్నారు. కాంగ్రెస్ కూడా తమతో కలసి వస్తేనే బీజేపీని ఓడించగలమని ఈ ఎన్నికల ద్వారా కుమారస్వామికి సంకేతాలు పంపింది.

మళ్లీ కింగ్ మేకర్ గా…?

అయితే కుమారస్వామి మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ గత ఎన్నికల మాదిరి కింగ్ మేకర్ అవుతామని భావిస్తున్నారు. కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తే తమకు అధికారం దక్కదన్నది ఆయన భావన. పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఉండటంతో ఎన్నికలకు ముందు ఏదైనా జరగవచ్చన్న ప్రచారం రెండు పార్టీల్లో జరుగుతుంది. మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో ఇద్దరూ కలిస్తేనే విజయం లభిస్తుందని ఇరు పార్టీల సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఎన్నికలకు ముందు ఏదైనా జరగొచ్చు.

The post మళ్లీ ఒక్కటవుతారా? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this