ఆ క్వారీ వైసీపీ ఎమ్మెల్సీదే.. అందుకే చర్యల్లేవ్

నిమ్మకాయల చినరాజప్ప

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి చినరాజప్ప మండి పడ్డారు. మైనింగ్ లో వైసీపీ దోపిడీకి అడ్డు అదుపులేకుండా పోయిందని అన్నారు. కడప జిల్లాలో పేలుళ్లు జరిగిన క్వారీ వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కుటుంబ సభ్యుల పేరుతో ఉందని చినరాజప్ప ఆరోపించారు. అసలు లీజు దారులను వదిలేసి, సబ్ లీజుకు తీసుకున్నవాళ్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని చినరాజప్ప అన్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ ద్వారా వంద కోట్ల ముగ్గురాయిని అక్రమంగా తరలించారని చినరాజప్ప ఆరోపించారు. పేలుళ్ల ఘటనపై తాము చర్చకు సిద్ధమని చినరాజప్ప ప్రకటించారు.

The post ఆ క్వారీ వైసీపీ ఎమ్మెల్సీదే.. అందుకే చర్యల్లేవ్ appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this