నరేంద్రను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చండి.. కోర్టు ఆదేశం

ధూళిపాళ్ల నరేంద్ర

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా నరేంద్రను జైలుకు తరలించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని14రోజులు క్వారంటైన్ లో ఉంచాల్సి ఉంటుందని, అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎలా రాజమండ్రి జైలుకు తరలించారని కోర్టు ప్రశ్నించింది. విచారణకు ప్రతి సారీ విజయవాడ తీసుకురావడం కష్టంగా మారిందని ఏసీబీ తరుపున న్యాయవాదులు చెప్పారు. అయితే రాజమండ్రిలోనే ప్రయివేటు ఆసుపత్రిలో నరేంద్ర ను ఉంచాలని కోర్టు పేర్కొంది.

The post నరేంద్రను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చండి.. కోర్టు ఆదేశం appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this