ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా.. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం

ఎన్నికల కమిషన్

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా కింద మే 31తో ఆంధ్రప్రదేశ్ లో మూడు స్థానాలు, జూన్ 3 వ తేదీతో తెలంగాణలో ఆరుస్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే కోరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

The post ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా.. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this