ఏ ఆర్ రెహమాన్ ఎవరో నాకు… భారతరత్న చెప్పు తో సమానం – బాలయ్య

నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆదిత్య 369 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీకి మా కుటుంబం ఎంతో చేసిందని అవార్డులతో దానిని పోల్చలేమని చెప్పుకొచ్చారు బాలయ్య. అంతేకాకుండా భారతరత్న అనేది ఎన్టీఆర్ కాలిగోటితో, చెప్పు తో సమానం అని పేర్కొన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఎవరో తనకు తెలియదని పదేళ్లకు ఒకసారి హిట్ ఇచ్చే ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చారని ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక్కో శైలి ఉంటుందని…ఇళయరాజా సంగీతం ఆదిత్య369 చిత్రానికి అద్భుతమని అన్నారు.

కాగా భారత రత్నను చెప్పు తో పోల్చడం, రెహమాన్ ఎవరో తెలియదు అని చెప్పటంతో ఇప్పుడు బాలయ్యపై ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. అయితే బాలయ్య నిప్పురవ్వ సినిమాకు గతంలో ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

Thanks! You've already liked this