నియంత్రణ ఏదీ? నిషేధం ఎక్కడ?

దేవినేని ఉమామహేశ్వరరావ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన జగన్ దాని ద్వారానే ఆదాయం పెంచుకుంటున్నారన్నారు. మద్యం దుకాణాలపై ఈ ప్రభుత్వానికి నియంత్రణ లేదని దేవినేని ఉమ అన్నాు. ఏడాదికి 2,400 కోట్ల మద్యం అమ్మకాలను లక్షాన్ని ప్రభుత్వం పెట్టుకుందన్నారు. కొత్తగా 300 మద్యం దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని దేవినేని ఉమ అన్నారు. సొంత మనుషులకు లబ్ది చేకూర్చేందుకు నాసిరకమైన బ్రాండ్లను తెచ్చారని దేవినేని ఉమ విమర్శించారు. మద్యనిషేధాన్ని ఈ ప్రభుత్వానికి అమలు చేసే యోచన లేదన్నారు.

The post నియంత్రణ ఏదీ? నిషేధం ఎక్కడ? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this