బ్రేకింగ్ : ఏలూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్

ఏలూరు మున్పిపల్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన కౌంటింగ్ ను నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. అయితే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కౌంటింగ్ ను న్యాయస్థానం నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు ఈ నెల 25వ తేదీన కౌంటింగ్ నిర్వహించుకోవడానికి అనుమతిచ్చింది.

The post బ్రేకింగ్ : ఏలూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this