విక్రమ్ లో అంధుడిగా కమల్ హాసన్!!

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా… జూలై 16 నుంచి ఈ సినిమా స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఇటీవల చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కమల్ హాసన్, విజయ్ సేతుపతి,ఫహద్ లతో కలిపి చూపించారు.ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో కమలహాసన్ అంధుడిగా నటించబోతున్నారట. గతంలో 1981లో కమలహాసన్ రాజా పార్వై సినిమాలో అంధుడిగా కమలహాసన్ నటించారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

Thanks! You've already liked this