మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు: జగ్గారెడ్డి సంచలన కామెంట్

మోదీ ప్రభుత్వం అప్రజస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌కు నిరసనగా చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన కాంగ్రెస్ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేపట్టింది.  ఈ సంరద్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఫోన్లను ట్యాప్ చేస్తూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్‌లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

Thanks! You've already liked this