చలో రాజ్ భవన్.. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా

ఫోన్ ట్యాపింగ్‌కు నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్‌ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఇందిరాపార్క్ ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. అక్కడి నుంచి ర్యాలీగా నేతలు బయలుదేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క జగ్గారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల చలో రాజ్‌భవన్‌ నేపథ్యంలో ఇందిరాపార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Thanks! You've already liked this