పేదలను ఆదుకోవడమే లక్ష్యం

జగన్

కాపు నేస్తం ద్వారా నిరుపేద మహిళలను ఆదుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ రెండేళ్లలో 900 కోట్లను చెల్లించామని జగన్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశ్యమని జగన్ అన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలు బాగుపడతాయని జగన్ అభిప్రాయపడ్డారు. 3,27,000 మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని జగన్ తెలిపారు. కోవిడ్ తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా సంక్షేమ పథకాల నిధులను ఆపడం లేదని జగన్ తెలిపారు.

The post పేదలను ఆదుకోవడమే లక్ష్యం appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this