గుట్కా తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది?: బండి

హుజూరా‌బాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ పాదయాత్ర చేస్తుండ‌డంతో సీఎం కేసీఆర్ కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పర్యటించిన బండి… మంత్రుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది అని ప్రశ్నించారు. ఈటల గెలిచిన తర్వాత డైరెక్ట్‌గా అయోధ్యకు వెళతామన్నారు.  కేసీఆర్ సర్వేలను మాత్రమే నమ్ముకున్నాడని అన్నారు. దళిత బంధు ప‌థ‌కాన్ని సీఎం కేసీఆరే నిలిపేసి, ఆ నెపాన్ని త‌మ పార్టీ మీదకు నెట్టేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక‌ హైదరాబాద్ లో తాము అతి పెద్ద‌ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామ‌ని స్పష్టం చేశారు. ఈ విష‌యంలో గ‌తంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోలేద‌ని విమర్శించారు.

ఇది కూడా చదవండిః హుజురాబాద్ లో కేసీఆర్ కు ఆ 412 ఓట్లు ఖాయం

Thanks! You've already liked this