కర్ణాటక లో కరోనా ఆంక్షల సడలింపు

ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి

బెంగళూరు: కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ ఆంక్షలను కర్ణాటక ప్రభుత్వం మరింత సడలించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు తదితర అన్ని ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. రేపటి నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు మీద ప్రకటన విడుదలయింది.

అమ్యూజ్ మెంట్ పార్కులను కూడా తెరుచుకోవచ్చని… అయితే కోవిడ్ గైడ్ లైన్స్ ను మాత్ర కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే వాటర్ స్పోర్ట్స్, నీటికి సంబంధించిన అడ్వెంచర్ యాక్టివిటీలకు మాత్రం అనుమతి లేదని తెలిపింది. ఇంతకు ముందు జూలై 18న కర్ణాటక ప్రభుత్వం సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతించింది. జులై 19 నుంచి రాత్రి కర్ఫ్యూ సమయాన్ని తగ్గించింది. ఈ నెల 26 నుంచి ఉన్నత విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.

మరోవైపు గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 39,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 546 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు భారత్ లో 3,13,32,159 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 4,08,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/

The post కర్ణాటక లో కరోనా ఆంక్షల సడలింపు appeared first on Vaartha.

Thanks! You've already liked this