ఖిలాడి షూట్ స్టార్ట్…ఎప్పుడో తెలుసా ?

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే సీనియర్ నటుడు అర్జున్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ దుబాయిలో చేయాల్సి ఉండగా కొన్ని సమస్యలతో హైదరాబాద్లోనే ప్రత్యేక సెట్ వేసి చేయడానికి నిర్ణయించారు దర్శకనిర్మాతలు. కాగా జూలై 26 సోమవారం నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Thanks! You've already liked this