ట్రైల్ షూట్ లో బిగ్ బీ..ప్ర‌భాస్‌!

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు… రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభ‌మైంది. బిగ్ బి, ప్ర‌భాస్ తో పాటు కీల‌క‌మైన తారాగ‌ణం అంతా ప్ర‌స్తుతం ఫిల్మ్‌సిటీలో ఉంది. ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌ల‌కు గెట‌ప్ ల టెస్ట్ చేస్తున్నార‌ని, ట్రైల్ షూట్ నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడు తీసిందంతా సినిమాల్లో ఉండ‌దు. కేవ‌లం ఇది ట్రైల్ షూట్ మాత్ర‌మే. అయితే ఈ షాట్స్ ని ప్ర‌చార చిత్రాల్లో ఉప‌యోగించుకోవాల‌నుకుంటున్నారు. ఇదో విచిత్ర‌మైన జోన‌ర్ కి చెందిన క‌థ అని, సోషియో ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ రెండూ మిళిత‌మై సాగుతాయ‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ఈ స్క్రిప్టు రాసుకోవ‌డంలో నాగ అశ్విన్ కి స‌హాయ ప‌డ్డారు. దీపికా ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2023లో విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

The post ట్రైల్ షూట్ లో బిగ్ బీ..ప్ర‌భాస్‌! appeared first on తెలుగు360.

Thanks! You've already liked this