విజయ్ దేవరకొండ ‘ఖుషి’..

విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
క్రిస్మస్ను కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
The post విజయ్ దేవరకొండ ‘ఖుషి’.. appeared first on Vaartha.