బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు.

ఆయా రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి. విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది.

రాజ్యసభకు ఎంపికైన వారికి ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. విజయేంద్రప్రసాద్‌ దశాబ్దాలపాటు సృజనాత్మక సేవలు అందించినట్లు మోడీ పేర్కొన్నారు.

” విజయేంద్రప్రసాద్‌ సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఇళయరాజా సంగీతం అనేక తరాలకు వారధిగా నిలిచింది. ఆయన సంగీతం అనేక భావాలకు ప్రతిబింబం. పి.టి.ఉష జీవితం.. ప్రతి భారతీయుడికి ఆదర్శం. అనేక ఏళ్లుగా ఎందరో క్రీడాకారులను పి.టి.ఉష తయారుచేశారు“ అని మోడీ ప్ర‌సంశ‌లు కురిపించారు.

రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్ ఎంపిక కావడం పట్ల.. తెలుగు సినీ రచయుతల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ” మా తెలుగు సినీ రచయుతల సంఘం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మన బాహుబలి విజయేంద్ర ప్రసాద్ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. కేంద్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైన అభినందనలు.“ అని తెలిపారు.

The post బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ first appeared on namasteandhra.

Thanks! You've already liked this