జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ద‌గ్గర నిధులున్నా కూడా ప‌నులు కావ‌డం లేద‌న్న అసంతృప్తి విప‌క్షంలో ఉంది. ఓ బాధ్య‌త గ‌ల ప్ర‌జా ప్ర‌తినిధిగా తాను చెప్పినా కూడా., నిధులు ఇచ్చినా కూడా స్పందించ‌ని అధికారులు ఉన్నార‌న్న అసంతృప్తి యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్  నాయుడు వ్యక్తం చేస్తున్నారు. గ‌తంలో అనేక విష‌యాల‌పై పోరాడి నిధులు తెప్పించిన దాఖ‌లాలు ఆయ‌న కెరియ‌ర్ లో ఉన్నాయి.

కానీ కొన్ని రాజ‌కీయ కార‌ణాల దృష్ట్యానే తాను చెప్పిన ప‌నులు ఆగిపోతున్నాయి అని ఎంపీ భావిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పులు చేస్తుంటే ఎంత కాలం అని భరించాలి అని సంబంధిత అధికారుల‌ను నిల‌దీస్తున్నారాయ‌న. విద్యుత్ శాఖకు సంబంధించి ఆ శాఖ నిర్వాకంపై నిన్న‌టి వేళ టెక్క‌లి లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే ఏం చేయాలో కూడా త‌న‌కు తెలుసున‌ని హెచ్చ‌రించి వ‌చ్చారు.

సౌమ్యంగా ఉంటే ప‌నులు కావు.. కాస్తైనా తిరుగుబాటు చేయాలి. చేయ‌క‌పోతే అధికారులు మాట వినేలా లేరు. వినిపించుకునే విధంగా కూడా లేరు. ఆఖ‌రికి నిధులున్నా కూడా ప‌నులు చేయ‌లేని దుఃస్థితి ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు ఉన్నారంటే ఏం అనుకోవాలి. ఇదే విష‌య‌మై నిన్న‌టి వేళ టెక్క‌లి డివిజ‌న్ కార్యాల‌యంలో ఎంపీ కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాను నిధులు ఇచ్చినా మంద‌స మండ‌లంలో ప‌నులు ఎందుకు చేయ‌డం లేద‌ని నిల‌దీశారు.ఈ  సంద‌ర్భంగా ఇక్క‌డి ఈఈతో మాట్లాడారు. క‌లెక్ట‌ర్ చెప్పినా ప‌నులు చేయ‌రా అని మండిప‌డ్డారు. అంతేకాకుండా ఉద్దేశ‌పూర్వ‌క జాప్యంపై ఆయ‌న నిల‌దీశారు. అనంత‌రం మంద‌స ఏఈతో ఫోన్లో మాట్లాడి స‌మ‌స్య ప‌రిష్కారానికి వీలున్నంత వేగంగా కృషి చేయాల‌ని చెప్పారు.

The post జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ ! first appeared on namasteandhra.

Thanks! You've already liked this