టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు

టాలీవుడ్ లో మరో విషాద ఘటన జరిగింది. ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతంరాజు (68) అనారోగ్యంతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతం రాజు…ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన కోలుకోవడంతో మంగళవారం నాడు ఇంటికి వచ్చారు. అనుకోకుండా మంగళవారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరణించారు. గౌతమ్ రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎడిటర్‌గా గౌతమ్ రాజుకు మంచి పేరుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాతో ఎడిటర్ గా గౌతం రాజు బాధ్యతలు చేపట్టారు. దాదాపు 800 సినిమాలకు పైగా గౌతంరాజు ఎడిటర్‌గా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌, రవితేజ కిక్‌, అల్లు అర్జున్ రేసుగుర్రం, ఎన్టీఆర్ అదుర్స్‌ వంటి టాప్ హీరోల సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటర్‌గా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమాకు గౌతమ్ రాజు ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఆది సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్నారు. ఇక గౌతంరాజు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నారు.

The post టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు first appeared on namasteandhra.

Thanks! You've already liked this