మ‌ద్య నిషేధంపై జగన్ మ‌డ‌త పేచీ…

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గన్ అనుస‌రిస్తున్న వైఖ‌రి విస్మ‌యం గొలుపుతోంద‌ని అంటున్నారు రాజ‌కీయ నేత లు. ఎన్నిక‌ల‌కు ముందు.. రాష్ట్రంలో మ‌ద్యాన్ని ద‌శ‌ల వారీగా నిషేధిస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న త‌ర్వా త‌.. అనుస‌రిస్తున్న ధోర‌ణి.. ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో.. అప్ప‌టి వ‌ర‌కు ప్రైవేటు వ్యాపారుల చేతిలో ఉన్న వైన్స్‌ను స‌ర్కారు స్వాధీనం చేసుకుంది. ఆ వెంటన న‌గ‌ర శివారు, గ్రామాల ప‌రిధిలో ఉన్న 25 శాతం దుకాణాలను ర‌ద్దు చేశారు.

దీనిని చాలా గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్నారు. ఇంకేముంది.. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే.. మ‌ద్య నిషేధం పై చ‌ర్య‌లు తీసుకున్నార‌ని.. మాట నిల‌బెట్టుకున్నార‌ని.. వైసీపీ నేత‌లు.. ప్ర‌చారం గొప్ప‌గా సాగించారు. ఇక‌, అదేస‌మ‌యంలో బార్ల‌ను కూడా ర‌ద్దు చేయాల‌ని చూశారు.కానీ, అప్ప‌టికే 2022 వ‌ర‌కు వారు లైసెన్సు లు తీసుకుని ఉండ‌డంతో సాధ్యం కాలేదు. స‌రే.. ఈ ఏడాదికి వ‌చ్చే స‌రికి బార్ల లైసెన్సుల గ‌డువు తీరిపోయింది. దీంతో ర‌ద్దు చేయాల‌ని అనుకుంటే.. వాటిని ర‌ద్దు చేయొచ్చు.

కానీ, వైసీపీ ప్ర‌భుత్వం అలా చేయకుండా.. మ‌రో మూడేళ్ల‌పాటు వాటిని పొడిగిస్తూ.. ఉత్త‌ర్తులు జారీ చేసిం ది. అంతేకాదు.. మ‌ద్యంపై వ‌చ్చే ఐదేళ్ల వ‌ర‌కు వ‌చ్చే ఆదాయాన్ని చూపుతూ.. అప్పులు తెచ్చుకుంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ ప్ర‌భుత్వం.. మ‌ద్యంపై మ‌డ‌త పేచీ పెడుతోంద‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు వీటన్నింటికీ.. భిన్నంగా.. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనివైన్ దుకాణాల‌ను తిరిగి ప్రైవేటుకు అప్ప‌గించేలా నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌ర్కారులు లీకులు ఇచ్చింది.

అంటే.. ఇక, నుంచి మ‌ళ్లీ పాత ప‌ద్ధిలోనూ మ‌ద్యం దుకాణాలు తెరుచుకునేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఉండే అవ‌కాశం ఉంది. మ‌రి దీనివ‌ల్ల‌.. మద్య నిషేధం ఉన్న‌ట్టా.. లేన‌ట్టా? అంటే.. ఖ‌చ్చితంగా లేన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా.. ప్ర‌భుత్వం మ‌ద్యం దుకాణాల‌ను కూడా పెంచే యోచ‌న‌లో ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం పాతిక వేల కోట్లుగా ఉన్న ఆదాయాన్ని 40 వేల కోట్ల‌కు కూడాపెంచే ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇలా.. ఏ విధంగా చూసుకున్నా.. మ‌ద్యంపై వైసీపీ మ‌డ‌త పేచీ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ స‌ర్కారును ఉంచాలా?  ఊడ్చాలా? అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకోవాల‌ని చెబుతున్నారు.

The post మ‌ద్య నిషేధంపై జగన్ మ‌డ‌త పేచీ… first appeared on namasteandhra.

Thanks! You've already liked this