కుప్పం విష‌యంలో `బోగ‌స్`  రాజ‌కీయం..  ..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ హైడ్రామా ఆడింద ని.. టీడీపీకి చెంద‌ని కొంద‌రు కార్య‌క‌ర్త‌లను వైసీపీ త‌న గూటికి చేర్చుకుంది. సుమారు 200 మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు వైసీపీలో చేరిపోయారు. కుప్పం వైసీపీ ఇంచార్జ్‌.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిల నేతృ త్వంలో వీరికి కండువాటు క‌ప్పి.. పార్టీ తీర్థం ఇచ్చారు. అయితే.. ఇక్క‌డే కీల‌క విష‌యం ఒక‌టి ఆస‌క్తిగా మారింది. వైసీపీలో చేరిన వారంతా టీడీపీ నాయ‌కులు కాదంటూ..   మీడియాలో ప్ర‌సారం అయింది.

టీడీపీ నుంచి వ‌చ్చారంటూ.. చేర్చుకున్న వారంతా కూడా బోగ‌స్ వ్య‌క్తులేన‌ని.. వారికి టీడీపీ స‌భ్య‌త న‌మో దు కార్డులు కూడా బోగ‌స్‌వేనని   మీడియాలో వచ్చింది. టీడీపీతో సంబంధం లేని వారిని, త‌మ పార్టీకి సంబంధం లేనివారిని.. తీసుకువ‌చ్చి.. వారికి బోగ‌స్ గుర్తింపు కార్డులు ఇచ్చి.. టీడీపీ నేత‌లను చేర్చుకుంటున్నారంటూ.. వైసీపీ సొంత మీడియాలో క‌థనాలు వండింది. ఇదంతా కుప్పంలో వైసీపీ ఆడుతున్న నాట‌కంగా.. టీడీపీ ప్రూవ్ చేసింది.

 అయితే.. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ కామ‌న్‌. నేరుగా స‌భ్యత్వం ఉన్నా.. లేకున్నా.. నాయ‌కులు పార్టీలు మారు తున్నారు. త‌మ అవ‌స‌రాలు.. అవ‌కాశాల కోసం.. వారు ఉవ్విళ్లూరుతున్నారు. గ‌తంలోనూ..ఇప్పుడు కూడా త‌మ‌కు అవ‌కాశం వ‌స్తే వెళ్లిపోయేవారు ఉన్నారు. సో.. జంపింగుల విష‌యంలో ఎవ‌రినీ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఇప్పుడు  చ‌ర్చంతా కూడా.. బోగ‌స్ గుర్తింపు కార్డులతో వైసీపీ చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఏంట‌నేదే! ఎందుకంటే, వ‌చ్చిన వారిని చేర్చుకునే అవ‌కాశం ఉంది. కానీ, ఇలా ఎందుకు చేశారో తెలియాల్సి ఉంది.

సాధార‌ణంగా.. చంద్ర‌బాబు కుప్పంలో పెద్ద‌గా ప‌ర్య‌టించ‌రు. కానీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌తి రెండు మూడు మాసాల‌కు ఒక‌సారి.. ఆయ‌న కుప్పంలో ప‌ర్య‌టించి.. అక్క‌డి ప‌నులు ప‌రిశీలించ‌డం.. నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం వంటివి చేస్తున్నారు. ఇది కూడా లేక‌పోతే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ప‌రాభవం త‌ప్ప‌ద‌ని ఆయ‌న అంచ‌నా వేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. ఇప్పుడు కుప్పంలో వైసీపీ మాత్రం ఎక్క‌డా త‌గ్గేదేలే అన్నట్లుగా ఉన్నా… ఎన్నికల్లో వైసీపీకీ ఎదురయ్యే కష్టాలను చూశాక అసలు కుప్పం గురించి పట్టించుకునే తీరికే జగన్ కు ఉండకపోవచ్చు.

The post కుప్పం విష‌యంలో `బోగ‌స్`  రాజ‌కీయం..  ..? first appeared on namasteandhra.

Thanks! You've already liked this