జగన్ కు మంగళగిరిలో లోకేష్‌పై పోటీ చేసే దమ్ముందా?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు పులివెందుల నుంచే పోటీ చేస్తున్నారు. వైఎస్ కుటుంబాని కి ఎలానూ క‌డ‌ప కంచుకోటలాగా ఉంది. సో.. అక్క‌డి నుంచే ఆయ‌న పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ న విజ‌యం ఎప్పుడూ న‌ల్లేరుపై న‌డ‌క మాదిరిగానే సాగుతోంది. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్‌.. అద్భుత‌మైన పాల న అదిస్తున్నాన‌ని.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు తాను చేరువ అవుతున్నాన‌ని.. బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా.. ప్ర‌జ‌ల కు సంక్షేమ పాల‌న‌ను అందిస్తున్నాన‌ని.. ప‌దే ప‌దే చెబుతున్నారు.

అంటే.. జ‌గ‌న్ ప‌ట్ల ప్ర‌జ‌లు అంద‌రూ ఆద‌రంతో ఉన్నార‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో అఖండ విజ యం క‌ట్ట‌బెట్టేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌నే అభిప్రాయంతో ఉన్నారు. న‌వ‌ర‌త్నాలు.. సంక్షేమం.. బ‌ట న్ నొక్కుళ్లు వంటివి.. పెద్ద ఎత్తున త‌న‌కు మేలు చేస్తాయ‌ని అనుకుంటున్నారు. ఓకే .. ఎవ‌రి భావాలు.. ఎవ‌రి అభిప్రాయాలు.. ఎవ‌రి న‌మ్మ‌కాలు వారికి ఉండొచ్చు. కాబ‌ట్టి.. జ‌గ‌న్ న‌మ్మ‌కం కూడా నిజ‌మేన‌ని అనుకుందామ‌ని.. అయితే.. ఆయ‌న పులివెందుల వ‌దిలి క‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వ‌చ్చి పోటీ చేసే ద‌మ్ము ఉందా? అనేది టీడీపీ త‌మ్ముళ్ల మాట‌.

“జ‌గ‌న్ త‌న పాల‌న‌పై చాలానే విశ్వాసం పెట్టుకున్నారు. ప్ర‌జ‌లు త‌న‌ను గెలిపించేందుకురెడీగా ఉన్నార‌ని. 175 కు 175 సీట్ల‌లోనూ గెలుస్తామ‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. అస‌లు ఆయ‌న క‌డ‌ప గ‌డ‌ప దాటి.. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసే దమ్ము ఉందా? “ అని టీడీపీ తమ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. మంగ‌ళ‌గిరి నియోజ క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు లోకేష్ మ‌రోసారీ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు లోకేష్ మీద పోటీ చేసే ద‌మ్ముందా? అనేది ప్ర‌శ్న‌.

ఇదే విష‌యంపై తెలుగు దేశం పార్టీ త‌మ్ముళ్లు సీఎం జ‌గ‌న్‌కు స‌వాల్ రువ్వుతున్నారు. త‌న‌పాల‌న‌పైనా.. త‌ను అమ‌లు  చేస్తున్న న‌వ‌ర‌త్నాల‌పైనా.. న‌మ్మ‌కం ఉంటే.. అవేగెలిపిస్తాయ‌ని అనుకుంటే.. జ‌గ‌న్ .. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ రువ్వుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో జ‌గ‌న్ క‌డ‌ప గ‌డ‌ప దాటి.. ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. గెలిచే ప‌రిస్థితి లేద‌ని.. ప్ర‌జ‌లు చిత్తుచిత్తుగా ఓడిస్తార‌ని.. విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న చేస్తున్న పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోతున్నార‌ని.. టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

“అభివృద్ది లేదు. రాజ‌ధాని లేదు. నిధులు లేవు. ప్రాజెక్టులు లేవు. ఉపాధి లేదు. పొరుగు రాష్ట్రం నుంచి రావాల్సిన విభ‌జ‌న హామీలు అంత‌క‌న్నా లేవు. కేంద్రాన్ని మెడ‌లు వంచుతాన‌ని.. తానే మెడ‌లు వంచే ప‌రిస్థితి వ‌చ్చింది. హోదా అన్నారు.. అట‌కెక్కించారు. పోల‌వ‌రం అన్నారు.. ఇప్ప‌టి వ‌రకు అతీ గ‌తీ లేదు. రోడ్లు ఎక్క‌డిక్క‌డ గుంత‌లు.. ఇలాంటి సీఎంనా కోరుకునేది“ అని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌కు త‌న‌పైనా.. త‌న పాల‌న‌పైనా న‌మ్మ‌కం ఉంటే.. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి.. లోకేష్‌పై గెల‌వాల‌ని అంటున్నారు.

The post జగన్ కు మంగళగిరిలో లోకేష్‌పై పోటీ చేసే దమ్ముందా? first appeared on namasteandhra.

Thanks! You've already liked this