న్యూడ్ ఫొటోలతో చిక్కుల్లో పడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ నుంచి విడుదలైన ఓ బోల్డ్ ఫొటోపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫొటో చూడ్డానికి కాస్త ఇబ్బందికరంగా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. ఇక, ఆ వ్యవహారం సద్దుమణగక ముందే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్ సంచలనం రేపింది. రణ్ వీర్ వంటి స్టార్ హీరో ఓ ఫొటో షూట్ కోసం దిగంబరావతారమెత్తడంతో చాలామంది షాకయ్యారు.

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రణ్ వీర్ పోస్ట్ చేసిన న్యూడ్ ఫొటోలు చాలామందికి షాకిచ్చాయి. ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా రణ్ వీర్ ఫొటోలకు పోజులివ్వడం సంచలనం రేపింది.పేపర్ మ్యాగజైన్ అనే మీడియా సంస్థ కోసం రణ్ వీర్ ఈ న్యూడ్ ఫొటో షూట్ చేశాడట. అయితే, మరీ అభ్యంతరక రీతిలో రణ్ వీర్ ఫొటోలుండడంతో ఈ స్టార్ హీరోపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా రణవీర్ సింగ్ పై ఓ స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చర్యల ద్వారా మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా రణ్ వీర్ వ్యవహరించాడని, వారి మనోభావాలను దెబ్బతీశాడని ముంబై చెంబూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. అంతేకాదు, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రణవీర్ పై చర్యలు తీసుకోవాలని, ఐటీ యాక్ట్, ఇతర సెక్షన్ల కింద రణవీర్ సింగ్ పై కేసు నమోదు చేయాలని ఆ ప్రతినిధి కోరారు.

రణవీర్ సింగ్ పై ఫిర్యాదు అందిందని, అయితే తాము ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణ జరుపుతున్నామని అన్నారు. మరి, ఈ వ్యవహారంపై రణ్ వీర్, అతడి అర్ధాంగి దీపికా పదుకొణెల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

The post న్యూడ్ ఫొటోలతో చిక్కుల్లో పడ్డ స్టార్ హీరో first appeared on namasteandhra.

Thanks! You've already liked this