హీరోలకు కార్లకు పోలిక పెట్టిన బండ్ల గణేష్

టాలీవుడ్ ను కొంతకాలంగా వరుస వివాదాలు, సమస్యలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం, టికెట్ ధరల తగ్గింపు, పెంపుల వంటి అంశాలతో టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు, దర్శకులు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రొడ్యూసర్ గిల్డ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ ల మధ్య వివాదం చర్చనీయాంశమైంది. టాలీవుడ్ సమస్యలపై పరిష్కారం దొరికే వరకు షూటింగ్స్ ఆపేస్తమంటోన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాన్ని నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వ్యతిరేకిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉండగా అసలు ప్రొడ్యూసర్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదని టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు రెమ్యునరేషన్స్ కరెక్ట్ గానే తీసుకుంటున్నారని, టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్ళే ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారని, వీళ్ళ వల్లే జనాలు థియేటర్స్ కి రావడం లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ క్రమంలోనేఅశ్వినీదత్ వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తనదైన రీతిలో స్పందించారు. 50 సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో ఉన్న అశ్వనీదత్ గారి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని బండ్ల అన్నారు. ఏ హీరోని, ఏ దర్శకుడిని రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అడిగే అర్హత ఎవరికీ లేదని బండ్ల తేల్చేశారు. ఒక్కో మోడల్ కారుకు ఒక్కో రేటు ఉంటుందని, అలాగే అందరూ హీరోలే అయినా, ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందని తన మార్క్ కామెంట్లు చేశారు బండ్ల.

కాల్షీట్లకు, షీట్లకు తేడా తెలియనివాళ్లు, షూటింగ్ ఎన్నింటికి మొదలవుతుందో, ఎన్నింటికి ప్యాకప్ అవుతుందో తెలియనివాళ్లు, ఏ రోజు ఏ లైట్లు వాడుతున్నారో తెలియనివాళ్లు, ఏ లొకేషన్ కు ఎంత చార్జి అవుతుందో తెలియనవాళ్లు కూడా సినిమాలు నిర్మిస్తున్నారని బండ్ల గణేశ్ ఎద్దేవా చేశారు. టాలీవుడ్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనవసరమని, ఒక ఫిలిం చాంబర్, ఒక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సరిపోతుందని బండ్ల అన్నారు. సినిమాలు తీయని వాళ్లు కూడా గిల్డ్ లో ఉంటారని, వాళ్లకేం తెలుసని బండ్ల గణేశ్ ప్రశ్నించారు.

The post హీరోలకు కార్లకు పోలిక పెట్టిన బండ్ల గణేష్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this