భీమవరం లేడీ కానిస్టేబుల్ అంట అంత క్రేజేంట్రా బాబూ

పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే గతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మ‌హిళ‌ల విష‌యంలో ఎలాంటి వివాదాలు వ‌చ్చినా.. ఎలాంటి విభేదాల‌కు తావు లేకుండా.. ప‌రిష్క‌రించ‌డమో.. కోర్టు ముందు వుంచ‌డ‌మో.. చేయాల్సిన పోలీసులు.. అదే మ‌హిళ‌ల విష‌యంలో రోడ్డున ప‌డ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ పోలీస్టేషన్లో ఓ లేడీ కానిస్టేబుల్ విష‌యంలో వివాదం త‌లెత్తి.. పురుష కానిస్టేబుల్‌పై సీఐ.. రెచ్చిపోయారు.

దుర్భాష‌లాడుతూ.. రోడ్డున ప‌డి మ‌రీ కొట్టుకున్నారు. ఈ సంఘ‌ట‌న  స్తానికంగా .. తీవ్ర సంచ‌ల‌నం రేపింది. ఈ ఇద్ద‌రిని విడిపించేందుకు.. పోలీసు స్టేష‌న్‌లోని మ‌రో న‌లుగురు కానిస్టేబుళ్లు రావాల్సి వ‌చ్చింది. విష‌యంలోకి వెళ్తే.. రాజేశ్ అనే కానిస్టేబుల్‌.,. స‌ద‌రు మ‌హిళా కానిస్టేబుల్‌తో స‌న్నిహితంగా ఉంటున్నారు. ఆమెకు వివాదం కావాల్సి ఉంద‌ని తెలిసింది. అయితే.. వీరివురు కూడా.. ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావ‌డంతో.. కొన్నాళ్లుగా క‌లిసిమెలిసి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే.. స‌ద‌రు మ‌హిళా కానిస్టేబుల్ విష‌యంలో అతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. సీఐ కృష్ణ‌భ‌గ‌వాన్‌పై కానిస్టేబుల్ రాజేశ్ ఇప్ప‌టికే.. ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు ఇత‌ర కానిస్టేబుళ్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో సీఐ.. కానిస్టేబుల్ రాజేశ్‌పై ఓ క‌న్నేసి ఉంచార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం.. కానిస్టేబుల్‌ రాజేశ్ స‌ద‌రు మ‌హిలా కానిస్టేబుల్‌ను త‌న బైక్‌పై లిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. దీనిని గ‌మ‌నించిన సీఐ కృష్ణభగవాన్ తట్టుకోలేకపోయారు.

మ‌హిళా కానిస్టేబుల్‌కు లిఫ్ట్ ఇవ్వొద్ద‌ని.. ఏదైనా ఉంటే.. బ‌య‌ట చూసుకోండ‌ని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. రాజేశ్ కూడా.. ఇది వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని.. మీకు అన‌వ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించాడు. దీంతో ఈ విషయంలో వారిద్దరికీ మధ్య చెలరేగిన వివాదం దాడిచేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు విచారణ చేసి సీఐని వీఆర్‌కు పంపారు.అదేవిధంగా ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

The post భీమవరం లేడీ కానిస్టేబుల్ అంట అంత క్రేజేంట్రా బాబూ first appeared on namasteandhra.

Thanks! You've already liked this