ఆ హీరోకు ఇంటిని అమ్మేసిన స్టార్ హీరోయిన్

భారత సినీ రంగంలో ఎంతో మంది అందాల భామలు హీరోయిన్లుగా మెరిసిపోయారు. కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్నారు. కానీ.. వారిలో ఒక్కరు మాత్రం అప్పటికి ఇప్పటికి అతిలోక సుందరి అన్న ట్యాగ్ ను అట్టే ఉంచేసుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నటి శ్రీదేవిని మాత్రమేనని చెప్పాలి. ఆమె నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. తనదైన మార్కును వేయటమే కాదు.. ఎంపిక చేసిన సినిమాల్ని చేసుకుంటూ పోవటం తెలిసిందే.

వరుస సినిమాలతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఆమెకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. తాజాగా జాన్వీ తన ఫ్లాట్ ను బాలీవుడ్ కు చెందిన నటుడికి అమ్మేసినట్లుగా ప్రచారం జరగుతోంది. జుహూలోని తన లగ్జరీ ఫ్లాట్ ను భారీ ధరకు అమ్మినట్లుగా వార్తలు వస్తున్నాయి. జుహౌలోని విల్లె పార్లీ అనే అపార్ట్ మెంట్ లో 14.. 15..16 అంతస్థుల్లో ఉన్న లగ్జరీ ప్లాట్ ను ఆమె రెండేళ్ల క్రితం (2020లో) కొనుగోలు చేసినట్లు చెబుతారు. అప్పట్లో ఆ ప్లాట్ ను రూ.35 కోట్లకు జాన్వీ కపూర్ కొనుగోలు చేసిందట.

అయితే.. తాజాగా ఆ ఫ్లాట్ ను బాలీవుడ్ ప్రముఖ హీరో రాజ్ కుమార్ రావు కొన్నట్లుగా చెబుతున్నారు. జాన్వీ కపూర్ తన ఇంటిని అమ్మాలనుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న అతడు..తన ప్రేయసి కమ్ సతీమణి పత్రలేఖతో కలిసి జాన్వీ ఇంటిని చూడటం.. కొనేందుకు ఓకే చెప్పటం జరిగిపోయిందట. ఈ సందర్భంగా జాన్వీకి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చేసి రూ.45 కోట్లకు ఫ్లాట్ ను సొంతం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

జాన్వీ ప్లాట్ కు భారీ ధరను ఇచ్చిన రాజ్  కుమార్.. ఆ ఇంటి పార్కింగ్ స్పేస్ కోసం మరో రూ.2కోట్లకు పైనే ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా స్టార్ నటి ఇంటిని.. మరో స్టార్ నటుడు కొనుగోలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

The post ఆ హీరోకు ఇంటిని అమ్మేసిన స్టార్ హీరోయిన్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this