దులీప్‌ ట్రోపీ 2022-23.. షెడ్యూట్ రిలీజ్ చేసిన బీసీసీఐ..

ప్రతిష్టాత్మకమైన ప్రాంతీయ జోనల్‌ ఫార్మాట్‌లో ఆడే దేశీయ క్రికెట్‌ టోర్నీలను పూర్తిస్థాయిలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. 1500కు పైగా మ్యాచ్‌లు నిర్వహించేలా 2022-23 సీజన్‌ కోసం ఆడనున్నట్లు తెలిపింది. దులీప్‌ ట్రోపీకి సెప్టెంబర్‌ 8 నుంచి మొదలై సెప్టెంబర్‌ 25తో ముగుస్తాయని చెప్పారు. ఇందులో దేశీయంగా మొత్తం ఆరు జోన్లుగా పోటీకి తలపడనున్నాయి. నార్త్త్‌, సౌత్‌, సెంట్రల్‌, వెస్ట్‌, ఈస్ట్‌ మరియు నార్త్‌ ఈస్ట్‌ జట్లు నాకౌట్‌ ప్రాతిపదికన ఆడతాయి. ఇందులో రెండు మిడ్‌డే టోర్నమెంట్‌లు సయ్యద్‌ ముస్తక్‌ అలీ ట్రోపీ, విజయ్‌ హజరే ట్రోపీ, మరో రెండు వైట్‌ బాల్‌ టోర్నీలుగా 38 టీమ్‌లు మూడు గ్రూపులుగా 8 టీమ్‌లు రెండు గ్రూపులుగా, మరో రెండు గ్రూపులు 7 టీమ్‌లుగా పోటీ పడతాయని బీసీసీఐ అధికారులు తెలిపారు.

ఇరానీ కప్‌ టోర్నమెంట్‌ అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు ప్రస్తుత రంజీ ట్రోపీ చాంపియన్‌లు తలపడతారు. దులీప్‌ ట్రోపీ కోసం ఐదు జోన్లుగా విభజించి నాకౌట్‌ ఫార్మాట్‌లో తలపడతాయన్నారు. దులీప్‌ ట్రోపీ గతంలో 2019-20 మధ్య జరిగింది. ఇరానీ కప్‌ 2018-19 సీజన్‌లో జరిగింది. ఇవేకాక రంజీ ట్రోపీలు సైతం కొవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 2022-23 సీజన్‌లో డిసెంబర్‌ 13తో ముగుస్తాయి. రంజీ ట్రోపీ భారత ప్రీమియర్‌ టోర్నమెంట్‌ రెండు కేటగిరీలుగా విభజించింది. ఎలైట్‌, ప్లేట్‌ టీమ్‌లుగా ఉంటాయి. ఎలైట్‌లో 32 టీమ్‌లు నాలుగు గ్రూపులుగా 8 టీమ్‌లు దేశీయ ఫార్మాట్‌లో ఆడతాయి. ప్రతి టీమ్‌ ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో టాప్‌లో నిలిచిన రెండు టీమ్‌లలో నాలుగు గ్రూప్‌లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుతాయి. అలాగే ప్లేట్‌ గ్రూప్‌లో ఆరు టీమ్‌లు 15 లీగ్‌ మ్యాచ్‌లు ఆడిన తరువాత ఇందులో టాప్‌ 4లో నిలిచిన టీమ్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుతాయి. ఎలైట్‌ మరియు ప్లేట్‌ లీగ్‌ మ్యాచ్‌లు డిసెంబర్‌ 13తో ముగుస్తాయి. ప్లేట్‌ మ్యాచ్‌ ఫైనల్‌ జనవరి 29, ఎలైట్‌ ఫిబ్రవరి 20తో ముగుస్తాయని బీసీసీఐ తెలిపింది. అలాగే మహిళా దేశీయ క్రికెట్‌ మ్యాచ్‌ను అక్టోబర్‌ 11 నుంచి మొదలైన నవంబర్‌ 5తో ముగిస్తారు. ఐసీసీస టీ20 ప్రపంచ కప్‌ సౌతాఫ్రికా టూర్‌ సందర్భంగా కుదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Thanks! You've already liked this